కుప్పం క్రీడా రంగంలో మరో నూతన అధ్యాయం!**
క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, యువతలో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన **RK SPORTS ARENA – INDOOR WOODEN COURT** ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావడం ఎంతో ఆనందంగా ఉంది. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయి. కుప్పం యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఇలాంటి క్రీడా వేదికలు మరిన్ని అందుబాటులోకి రావాలి. ఈ స్పోర్ట్స్ అరేనా నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు. క్రీడా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#Kuppam #kuppamdevelop
#RKSportsArena #andrapradesh
#kancharlasrikanth
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా శాంతిపురం మండలం శివరామపురం పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి ఎంపికపై టీడీపీ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో చర్చించడం జరిగింది. గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ అందరి సమన్వయంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చించడం జరిగింది. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వడానికి కృషి చేయాలని సూచించడం జరిగింది.
#NaraChandrababuNaidu #kuppam #TeluguDesamParty #Shanthipuram #andrapradesh #PanchayatElections
#kancharlasrikanth
కుప్పం అభివృద్ధికి ప్రజల మద్దతు.. గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ అదే విజయపరంపర కొనసాగించాలి!**
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొనడం జరిగింది.
ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి తమ ఓటు ద్వారా ప్రజలు మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 100 శాతం విజయాన్ని అందించి తమ మద్దతును చాటారని తెలియజేయడం జరిగింది. ఇదే విజయపరంపరను గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తూ, సర్పంచ్ ఎన్నికల్లో సైతం వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి ఆ విజయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందించేలా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈరోజు కుప్పం మండలం కొట్టాలూరు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు, గ్రామ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
#KuppamMandal #NaraChandrababuNaidu #kuppam #AndhraPradesh #GramaPanchayatElections
🪔 Happy Diwali 🪔
సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలతో
ప్రజలంతా సుఖసంతోషంగా ఉండాలని,
ప్రతి ఇంట ఆనందాల వెలుగులు నిండాలని కోరుకుంటూ
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు
#FestivalOfLights #DiwaliWishes #HappyDiwali2026 #kuppam
టీడీపీ ప్రభంజనం… కూటమి విజయోత్సవం! 🚲💛
గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసి ఘనవిజయం సాధించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మరియు కూటమి అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు
#TeluguDesamParty #ChittoorDistrict #nda #VictoryCelebrations #NaraChandrababuNaidu #NaraLokesh #TDPPrabhanjanam
కుప్పం కోటపై తెలుగుదేశం పార్టీ విజయకేతనం!
రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు **మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కంచుకోట కుప్పంలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించింది!** 32 వార్డులకు 32 వార్డులు కైవసం చేసుకుంటూ… మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని సైతం దక్కించుకుని చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది!** ఈ అఖండ విజయం కుప్పం మునిసిపాలిటీ ప్రజలకు తెలుగుదేశం పార్టీపై ఉన్న అపారమైన నమ్మకానికి, సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఈ విజయంతో కుప్పం గడ్డపై తెలుగుదేశం పార్టీ తన విజయకేతనాన్ని మరింత ఎత్తుకు ఎగురవేసింది! ఈ చారిత్రాత్మక విజయాన్ని అందించిన **కుప్పం మున్సిపాలిటీ ఓటరు మహాశయులకు పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు!**
ఈ విజయం ప్రజల విజయం… కార్యకర్తల విజయం… తెలుగుదేశం పార్టీ విజయ పరంపరలో మరో స్వర్ణాధ్యాయం!
#TeluguDesamParty #Kuppam #KuppamVictory #ChandrababuNaidu #HistoricVictory TDPWinning JaiTDP
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శాంతిపురం మండల ZPTC అభ్యర్థి శ్రీ విజయరామిరెడ్డి గారు మరియు మొరసనపల్లె పంచాయతీ MPTC అభ్యర్థి శ్రీమతి రేవతి రత్నప్ప గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మొరసనపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పం అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే ఆకాంక్షతో కుప్పం మున్సిపాలిటీ 26వ వార్డులో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ అమూల్యమైన హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలి. ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి.
మీ ఓటు.. మీ భవిష్యత్తుకు బాట!
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి!
#MyVoteMyRight #kuppam
#NaraChandrababuNaidu
#votefordevelopm
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రాజ్ కుమార్ గారిని, అలాగే 32 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#KuppamMunicipality #NaraChandrababuNaidu #TeluguDesamParty #VoteForCycle #KuppamDevelopment
🚲 కుప్పం మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం!
రాష్ట్ర ముఖ్యమంత్రి, కుప్పం ముద్దుబిడ్డ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ ఎస్. రాజ్‌కుమార్ గారితో పాటు 32 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా, 27, 28, 32, 8, 6వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
🤝 కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని కోరడం జరిగింది.
🚲 కుప్పం అభివృద్ధి కొనసాగాలన్నా… ప్రజా సంక్షేమం ప్రతి ఇంటికీ చేరాలన్నా… మన కుప్పం ప్రగతి పథంలో ముందుకు సాగాలన్నా… సైకిల్ గుర్తుకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మన ఓటు – కుప్పం అభివృద్ధికి బాట!
మన లక్ష్యం – కుప్పం అభ్యున్నతి!
🚲 మన గుర్తు – సైకిల్!
#Kuppam #KuppamDevelopment #TDP #NaraChandrababuNaidu #KuppamMunicipality #CycleSymbol
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుళ్లేపల్లి 6వ వార్డుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి సాదరంగా స్వాగతం పలకడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆశయాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
#TeluguDesamParty #Kuppam #Gullepalli #ChandrababuNaidu #KuppamMunicipality
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో కుప్పం మునిసిపాలిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్. రాజ్ కుమార్ గారితో పాటు 32 కౌన్సిలర్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీకి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్ మహాశయులకు వివరించడం జరిగింది. కుప్పం అభివృద్ధి చేసేది చంద్రబాబు గారే చేయబోయేది చంద్రబాబు గారే అని వివరిస్తూ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లకు ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ రోడ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.
#Kuppam #KuppamMunicipality #NaraChandrababuNaidu #TDP #TeluguDesamPart
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆదివారం కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్ కుమార్, 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్యాంసుందర్ తరఫున ప్రచారంలో పాల్గొని, ఇంటింటా వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి సారధ్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరించడం జరిగింది. ఓటర్లు తమ విలువైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ముద్రించాలని కోరడం జరిగింది
#NaraChandrababunaidu
#KuppamMunicipality
#KuppamElections
#TeluguDesamParty
#votefortdp
కుప్పంలో కూటమి విజయమే లక్ష్యం.. 100% స్ట్రైక్ రేట్ దిశగా అడుగులు!**
రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ **నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో**, కుప్పం మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను 13 వార్డులు ఏకగ్రీవం కావడం శుభపరిణామం. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తోపాటు మిగిలిన 19 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, కుప్పం గడ్డపై కూటమి విజయపతాకాన్ని ఎగురవేయాలని ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజల ఆశీర్వాదం.. కూటమి అభ్యర్థుల విజయం! మన లక్ష్యం 100% స్ట్రైక్ రేట్.. మన సంకల్పం అభివృద్ధి చెందిన కుప్పం!
#Kuppam
#NDA
#TeluguDesamParty
#NaraChandrababuNaidu #NaraLokesh
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని, టీటీడీ ఆధ్వర్యంలో కుప్పం చెరువు కట్ట వద్ద నిర్వహించిన శ్రీ మహాలక్ష్మీ దీప పూజా కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనమ్మ గారు పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఈ పవిత్రమైన పూజా కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో హాజరై, భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
#SriMahalakshmi
#DeepaPooja #Kuppam
#NaraBhuvanamma #ChandrababuNaidu
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.
ఆ దుర్గామాత దివ్య ఆశీస్సులతో మీ కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
*మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు*
#HappyVijayadashami
#HappyDussehra
గతంలో చేసిన అరాచకాలను ఇప్పుడు కూడా కొనసాగించాలనుకుంటే..!!
ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు..!! #Kuppam #EndOfYcp #TDPSOCIALMEDIAFORTDP
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆశీస్సులతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నటసార్వభౌములు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తల ఉత్సాహం మధ్య భారీ ర్యాలీగా వెళ్లి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది.
#Kuppam #KuppamMunicipalElections #TeluguDesamParty #NaraChandrababuNaidu
#andrapradesh
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని, భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#MaguntaSrinivasuluReddy #HappyBirthday #ongolemp #andrapradesh
1
11
183
ప్రపంచం గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్త, యువతకు మార్గనిర్దేశకులు, జీవితాంతం దేశ ప్రతిష్ట కోసం తపించిన దేశ భక్తుడు, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డారక ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
#APJAbdulKalam
#MissileManOfIndia
#Inspiration
#andrapradesh
#kancharlasrikanth





















































